ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 12 September 2026, 3:17 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

జీఓ నెంబర్ 97 రద్దుకొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యార్ధుల నిరసన

జీఓ నెంబర్ 97 రద్దుకొనసాగుతున్న పాలిటెక్నిక్ విద్యార్ధుల నిరసన.

సికింద్రాబాద్. అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 12.

జీఓ నెంబర్ 97 రద్దును కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పొలిటెక్నిక్ కాలశాల విద్యార్థులు చేస్తున్న నిరసన నేటికి 26వ రోజుకు చేరుకుంది. సికింద్రాబాద్ లోని పాలిటెక్నిక్ కాలశాల విద్యార్థులు జీఓ.97 రద్దును  ఆంగ్ల అక్షరాలతో సూచిస్తూ బైఠాయించి వినూత్నంగా నిరసన తెలిపారు. తమ పుస్తకాల బ్యాగ్ లను మధ్యలో  బతుకమ్మల మాదిరిగా ఉంచి చుట్టూ తిరుగుతూ, శక్తి స్కీం కు వ్యతిరేకంగా పాటలు పాడుతూబతుకమ్మ ఆటలు ఆడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ ఉద్యమాన్ని చేపట్టి  25రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావడం లేదని, తమబవిష్యత్తుతో ఆటలాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుండి తప్పకుండా సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.